Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామగ్రామన మహిళలు పూలతో ఘనస్వాగతం
నవతెలంగాణ- ముదిగొండ
సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన బాణమే పీపుల్స్ మార్చ్ (మహాపాదయాత్ర)గత నెల27న ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో భట్టి ప్రారంభించారు. అక్కడి నుండి అప్రతిహతంగా పాదయాత్ర కొనసాగుతుంది. భట్టి పాదయాత్ర ప్రజాసమస్యలను స్పశిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా పాదయాత్రను మల్లు భట్టి నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లోపభూయిష్టమైన పరిపాలన గురించి, ప్రజాసంక్షేమ పథకాల పట్ల ప్రభుత్వ ఉదాసీనతనుతో పాటు, ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలం చెందిన తెరాస ప్రభుత్వ విధానాలను, కెసిఆర్‌ను అనుసరిస్తున్న వైఖరిని గ్రామ గ్రామాన ప్రజలకు పాదయాత్ర ద్వారా వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రజల నుండి వస్తున్న సమస్యల విజ్ఞాపన పత్రాలను కూడా స్వీకరిస్తూ ప్రజలకు ధైర్యం చెప్తూ, అసెంబ్లీలో ప్రజా గొంతుక తన గళాన్ని వినిపిస్తానని భట్టి ప్రజలకు భరోసాస్తున్నన్నారు. ఈపాదయాత్ర మండలంలో పదిహేను గ్రామాల్లో పర్యటించి 55 కిలోమీటర్ల వరకు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగింది. గ్రామగ్రామాన మల్లు భట్టి పాదయాత్రకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు పూలతో ఘనస్వాగతం పలుకుతూ, గజమాలతో పూలదండలతో, అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. ఈనెల ఆరో తేదీ వరకు ముదిగొండ మండలంలో భట్టి పాదయాత్ర కొనసాగనుంది. మధిర నియోజకవర్గ పరిధిలో 33 రోజులపాటు 500 కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్ర కొనసాగించేందుకు మల్లు భట్టి విక్రమార్క రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు.