Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంధుడి అవసరాలను గుర్తించాలని ఆదేశాలు
చేయూత ట్విట్‌కు స్పందన
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన అంధడు అబ్బూరి సీతయ్య, వృద్ధురాలైన భార్య సహాయంతో బతుకీడుస్తున్న పరిస్ధితిపై మంత్రి కేటీఆర్‌కు ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు చేయూత గ్రూపు ట్విట్ చేసింది. ఆ ట్విట్‌కు కలెక్టర్ వీపీ గౌతమ్ స్పందించి దంపతుల స్ధితిగతులు అవసరాలను గుర్తించాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. చేయూత ట్విట్‌కు రీ ట్విట్‌గా కలెక్టర్‌పై విధంగా డబ్ల్యూసీడీ ఖమ్మంకు ఫార్వడ్ చేశారు. మాధారంకు చెందిన అబ్బూరి సీతయ్య(70) రెండు కండ్లు కనపడవు, భార్య లచ్చమ్మ(65) కూడా కర్ర సహాయంతో నడుస్తుంది. దీంతో ఒకరికి ఒకరు తోడుగా బతుకీడుస్తున్నారు. వీరు సీతయ్యకు వచ్చే వికలాంగుల పింఛన్ తప్ప మారో ఆధారం లేదు. వారు నివసించే ఇల్లు సైతం గ్రామస్తుల సహకారంతో గోడలు కట్టి వాటికి డేరాలకట్టి దానిలో కాపురం సాగిస్తున్నారు. వీరి కొడుకులు లేరు. కూతురు ఉండగా అమెకు వివాహం చేసి అత్తవారింటికి పంపగా కుమార్తె భర్త మృతి చెందటంతో అత్తవారి ఇంటివద్దనే ఉంటుంది. దీంతో అంధ, వృద్ద దంపతుల జీవనం కష్టంగా మారింది. ఈ విషయాన్ని చేయూత కుటుంబ గ్రూపు సభ్యులు తెలుసుకోని వారికి సభ్యులు అందించే అర్ధిక మొత్తంను సహాయం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు వారి పరిస్ధితిపై గ్రూపు సభ్యులు వంశీకృష్ణ, మంత్రి కేటీఆర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ట్విట్ చేయటంతో స్పందన వచ్చింది. ప్రభుత్వ పరంగా అనాధులుగా మిగిలిన వారిని అధుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.