Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ- ఖమ్మం
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి క్యాథ్యాబ్లో విజయవంతంగా మొట్టమొదటి స్టెంటింగ్ 3 లక్షల విలువైన ఉచిత వైద్య సేవలు అందించారని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదప్రజలకు అత్యాధునిక హృద్రోగ సేవలందించేందుకుగాను జిల్లా మంత్రి పువ్వాడ అజరుకుమార్ ప్రత్యేక చొరవతో సుమారు రూ.7 కోట్ల వ్యయంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకొని జనవరి 28న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించుకున్న క్యాథ్యాబ్ ద్వారా ఫిబ్రవరి 25వ తేదీన హృద్రోగికి స్టెంటింగ్ వేసినట్లు తెలిపారు. ఖమ్మంనగరం ముస్తఫానగర్‌కు చెందిన 60 సంవత్సరాల వయస్సు కలిగిన జి.సుధాకర్ ఛాతి నొప్పితో బాధపడుతూ ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరినారని, హృద్రోగ నిపుణులు డాక్టర్ సీతారాం పేషెంట్‌ను పరీక్షించి అత్యవసర పరిస్థితిలో కరోనరి అంజియోగ్రామ్ చేశారని, పేషెంట్‌కు అత్యవసరంగా స్టెంటింగ్ అవసరముందని, భావించి అదేరోజు స్టెంటింగ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జి.సుధాకర్ అందించిన హృద్రోగ వైద్యసేవలు, స్టెంటింగ్కు గాను ప్రయివేటు ఆసుపత్రులలో అయితే సుమారు 3 లక్షల రూపాయలు వరకు ఖర్చు అయ్యోదని, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా పేషెంట్‌కు స్టెంటింగ్, హద్రోగ వైద్యసేవలు అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. చికిత్స అనంతరం జి. సుధాకర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నందున బుధవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు, గుండె వైద్యనిపుణులు డాక్టర్ సీతారాం, డాక్టర్ సురేష్ ఆసుపత్రి వైద్యాధికారులు సమన్వయంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి క్యాథా ల్యాబ్‌లో మొదటి స్టెంటింగ్‌ను విజయవంతంగా చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గుండె జబ్బులను కనుగునేందుకు గాను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు మధిర, సత్తుపల్లి, పాల్వంచ, అశ్వారావుపేట, చర్ల, గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కొత్తగూడెం, మహబుబాబాద్, సూర్యపేట జిల్లా ఆసుపత్రులు, భద్రాచలం, మణుగూరు, కోదాడ, హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రులు, తిరుమలాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తీసిన ఈ.సి.జిలను స్టమీ ఆన్లైన్ ద్వారా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కార్డియాలజిస్టుచే పరీక్షింపజేసి అవసరమైన వారికి యాంజియోగ్రమ్, స్టంట్ వేసేందుకు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాథ్యాబ్ ద్వారా ఉచిత గుండె వైద్యసేవలను వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో క్యాథా ల్యాబ్ ఏర్పాటుకు ప్రధాన కారకులైన జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కి, ప్రాణాపాయం నుండి కాపాడిన వైద్యబంధానికి పేషెంట్ జి.సుధాకర్ ధన్యవాదాలు తెలిపినట్లు కలెక్టర్ తెలిపారు.