Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల
నవతెలంగాణ- ముదిగొండ
పంటకల్లాలు ఏర్పాటు చేసుకొని సద్వినియోగ పరుచుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి విజయనిర్మల రైతులకు సూచించారు. మండలం లోని యడవల్లి, సువర్ణపురం, న్యూలక్ష్మీపురం గ్రామాల్లో ఆమె బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి పంటల నమోదును ఆమె పరిశీలించారు. అనంతరం యడవల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రైతు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మొక్కజొన్నసాగుపై పేనుబంకపై ఆమె పలు సూచనలు సలహాలు చేశారు. పంట కల్లాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మందుల రాధ, ఏఈఓలు దివ్యమనీషా, లిఖిత మౌనిక, పలువురు రైతులు పాల్గొన్నారు.