Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగ్రహావేశాలకు పోకండి
- వార్డు, గ్రామ స్ధాయి నుండి మాజీలందర్ని
కలుపుకుపోండి
- నియోజకవర్గ జనరల్‌బాడీలో విప్ రేగా
నవతెలంగాణ-ఇల్లందు
రాష్ట్రంలో రేపు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా గెలుపు టీఆర్ఎస్దేనని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని ఐతా కాంప్లెక్‌లో బుధవారం ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన తెరాస ఇల్లందు నియోజకవర్గ స్థాయి జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడారు. విద్యా, వైద్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. ఉచిత విద్యుత్, మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించామని రైతు బంధు, కళ్యాణ లక్ష్మి తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇదే విధంగా రాస్ట్ర వ్యాపితంగా నియోజకవర్గ స్దాయిలో ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసిందన్నారు. మన ఊరు మన బడి ప్రణాళిక,నిధులు సిద్దమయ్యాయన్నారు. మన ఊరు మన బడి పధకం కింద రాష్ట్రంలో తొలి విడతగా రూ.7వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు. ఈ నెల 8న వనపర్తిలో సీఎం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
గెలిపించడానికి ప్రజలు క్లియర్‌గా ఉన్నారు..ఆగ్రహవేశాలకు పోకండి
వార్డు, గ్రామ స్థాయి నుండి మాజీలందర్ని కలుపుకుపోండి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 5 నియోజకవర్గాల్లో టిఆర్ఎస్దే గెలుపన్నారు. గెలిపించడానికి ప్రజలు క్లియర్‌గా ఉన్నారని తెలిపారు. చిన్నచిన్ని పంచాయతీలు వస్తాయి, పోతాయి. నాయకులు ఆగ్రహావేశాలకు పోవద్దని అన్నారు. ఓపిక, సహనం ఉండాలన్నారు. జిల్లాలో చాల మంది గ్రాడ్యుయెట్లు రాజకీయాలలో ఉన్నారని అన్నారు. వారి సేవలు ఉపయోగించుకోవాలన్నారు. గ్రామం, మండల స్థాయిలో పర్యటనలు చేసి, స్థానికులకు అభివృద్ది కోసం పలు సూచనలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. వార్డు దగ్గర నుండి గ్రామస్ధాయి వరకు మాజీలు అందరినీ కపుకుపోవాలని అన్నారు. యాక్టీవ్‌నెస్ లేని నాయులను తొలగించాలన్నారు. టీఆర్ఎస్ అనుభంధ సంఘాలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా తెరాస అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు, భద్రాద్రి, మహబూబాబాద్ జడ్పీ చైర్మన్లు కోరం కనుకయ్య, బిందు, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లందు పురపాలక చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం అతిధులకు నేతలు ప్రజాప్రతినిధులు సన్మానాలు చేశారు.