Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌ను కలసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి
నవతెలంగాణ-ఇల్లందు
మున్సిపల్ కార్మికులకు పెరిగిన జీతాలు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ ఇఫ్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మునిసిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఎన్ఎంఆర్, టాటా మ్యాజిక్ డ్రైవర్లు హెల్పర్లకు జీఓ 60 ప్రకారం పెరిగిన కేటగిరీల వారీగా జీతాలు అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఇల్లందు కమిషనర్‌తో మాట్లాడితానని ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పాలకవర్గం మునిసిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పెరిగిన జీతాలు పాల్వంచ కొత్తగూడెంలలో జనవరి నుండి చెల్లిస్తున్నారని, ఏరియర్స్ ఈనెలలో చెల్లిస్తు న్నారని ఇల్లందులో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.