Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో పర్యటన...
- బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం
నవతెలంగాణ- కల్లూరు
పార్టీని నమ్ముకుని అహర్నిషలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఎంతో మంది కార్యకర్తలు వివిధ కారణాలతో అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొం టున్నారని, ప్రతి కార్యకర్త కష్టం తన కష్టంగా భావించి వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండల పర్యటనలో భాగంగా బుధవారం కల్లూరు పట్టణం, వెన్నవల్లి, చెన్నూరు, విశ్వనాధపురం గ్రామాల్లో పొంగులేటి పర్యటించారు. నారాయణపురం గ్రామంలోని పొంగులేటి నివాసం వద్ద బత్తులపల్లి గ్రామానికి చెందిన నాయకులు ఆయన్ను కలిసి హరిజనవాడలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యా లమ్మ మైసమ్మ గుడి వివరాలు నిర్వహకులు తెలుపగా వారికి పొంగులేటి విరాళంను అందజేశారు. వెన్నవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండపల్లి శ్రీమన్నారాయణ ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకోగా అతన్ని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో మాజీ సర్పంచ్ పాములపాటి భద్రయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన మాజీ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గ్రంధి నాగేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహా యంను అందజేశారు. చెన్నూరు గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల మరణించిన సంపసాల అశోక్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలో రావికంపాడు గ్రామవాసి మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సీనియర్ నాయకులు గొర్రెపాటి రాధయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుమారుడు రఘురామ్‌ని పరామర్శించారు. నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని యన్‌యస్‌పి క్రాస్ రోడ్లో అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రేమా నందంను పరామర్శించి ఓదార్చారు. విశ్వనాధ పురం గ్రామంలో బోషం బూషయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజరుబాబు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, హనుమతండా సర్పంచ్ మోహన్ నాయక్, ఓబుల్రావు బంజర్ సర్పంచ్ మాన్ సింగ్ నాయక్, కల్లూరు పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు పసుమర్తి రాంబాబు, చారుగుండ్ల అచ్యుత సీతారామారావు, దోసపాటి శ్రీనివాసరావు, బీసీ సంఘం మండల అధ్యక్షుడు లింగబోయిన పుల్లారావు, మండల నాయకులు యాసా వెంకటేశ్వరరావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఏనుగు సత్యంబాబు, మచ్చా వెంకటేశ్వరరావు, తోటకూర శేషగిరిరావు, వేమిరెడ్డి వెంకట్‌రెడ్డి, అభిలాష్, లక్కిరెడ్డి. ఏసు రెడ్డి, కాటేపల్లి. కిరణ్, పొదిలి వెంకటేశ్వర్లు, జంగా పిచ్చిరెడ్డి, వైకుంఠ శ్రీనివాసరావు, మద్దినేని. లోకేష్, షేక్.ఉస్మాన్, షేక్ తురాఅలి, ఉబ్బన. శ్రీనివాసరావు, కే.వెంకట్, చంటి బండి, వీరబాబు, బత్తుల రాము, మట్టూరి. జనార్దన్, కస్తాల నరేందర్, రామకృష్ణ, చందునాయక్, గుగులోత్ ప్రసాద్, జల్లా. యశ్వంత్, ప్రహల్లాదరావు, నల్లగట్ల పుల్లయ్య, ఆలకుంట నరసింహారావు, దామల సురేష్, లాల్ సింగ్ నాయక్, పంతులు నాయక్, శంకర్ నాయక్, జానీ, తాళ్లూరి రమేష్, టైలర్ ప్రసాద్, మారుతీ వీరయ్య, చిరంజీవి, కాటంనేని. వీరభద్రం, పరిగడుపు. వెంకట్, దుగ్గిరాల. సీతారాములు, బొజారు ఉపేందర్, కిరణ్, రామారావు, శ్రీ రామ్, నాగరాజు, వేల్పుల బాబురావు, వేల్పుల స్వాతి, రమేష్, పల్లెపాటి గోపి, కావేటి రామకృష్ణ, ఇమ్మినేని ప్రసాద్, మానస నాని, మహేష్, ముదిగొండ రాము, సత్యనారాయణరెడ్డి, వీణాచారి, కమలాకర్‌రావు, యస్వి రెడ్డి, షేక్ మైబు, ఉబ్బన వెంకటరత్నం, నోటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చర్చి వార్షికోత్సవ వేడుకల్లో మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మంరూరల్ : మండల పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డులోని ఏదులాపురంలో ఉన్న చర్చి 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఇటీవల రామకోటయ్య జ్ఞాపకర్ణాం వారి కుటుంబ సభ్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. శాబాదు నారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఇంకా మరికొన్ని కుటుంబాలను పరామర్శించారు. పొంగులేటి వెంట తోట చిన్నవెంకటరెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, మద్దికిశోర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్, వెంపటి రవి, తదితరులు పాల్గొన్నారు.