Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-భద్రాచలం
పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల ఆన్ లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం, భద్రాచలం నుండి ఇంటర్ ఆపై స్థాయి కళాశాలల అధ్యాపకులతో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు ఆన్లైన్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సి అభివృద్ధి శాఖ ద్వారా విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరుకు దరఖాస్తులు చేసిన ఉప కార వేతనాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. సకాలంలో ప్రక్రియ పూర్తి చేయకపోవడం వల్ల విద్యా ర్థులకు నష్టం జరుగుతుందని, ప్రాధాన్యతను గుర్తించి సత్వరం పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సి అభివృద్ధి అధికారిణి అనసూర్య, సహాయ సంక్షేమ అధికారులు వెంటేశ్వర్లు, శివ భాస్కర్‌తో పాటు వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.