Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.మూడు లక్షల రివార్డు గల మావోయిస్టుల మృతి
నవతెలంగాణ-చర్ల
జిల్లాలో మంగళవారం మరోసారి జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఓ మావోయిస్టులను హతవ ూర్చాయి. హతమైన మావో యిస్టును లఖ్మా కవాసీగా గుర్తించారు. ఇతనిపై గతంలో ప్రభుత్వం రూ.3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. విశ్వసనీయ సమాచారం మేరకు కాటేకళ్యాణ్ అడవుల్లో 10 నుంచి 15 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు అర్థరాత్రి సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా, పోలీసులు దంతెవాడ నుండి డిఆర్జి జవాన్ల బృందాన్ని ఆ ప్రాంతాన్ని వెతకడానికి రప్పించారు. జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకోగానే అప్పటికే పొంచి ఉన్న మావోయిస్టులు సైనికులపై కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే, మావోయిస్టుల బుల్లెట్లకు జవాన్లు కూడా ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది.