Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాలిటీల్లోనూ ఇంటి పన్ను మాఫీ చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుల నబి
నవతెలంగాణ-ఇల్లందు
కేసిఆర్ జీహెచ్ఎంసీ హైదరాబాద్‌లోని 250 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తు న్న ప్రజలకు ఇంటి పన్ను మాఫీ చేస్తామని కేసిఆర్ ప్రకటించడం అభినందనీయమని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుల నబి అన్నారు. స్థానిక ఏలూరు భవన్లో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, మరియు మిగిలిన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఇంటి పన్ను రాయితీలు ప్రకటించాలని ఆయన కోరారు. గ్రేటర్ హైదరబాద్‌లో ఉన్న ప్రజలే పేదలు కాదని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు పేదలు ఉన్నారని అన్నారు. ఒకరికి ఒక న్యాయం మరొకరి మరో న్యాయం సరికాదన్నారు. పాలకులకు ఇది తగదని ఆయన అన్నారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి వల్ల ప్రజలు ఉపాది కోల్పోయి దయనీయ స్థితిలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి యాకయ్య, తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్ కుమార్, వజ్జా సురేష్, మన్యం మోహనరావు పాల్గొన్నారు.