Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయులు అందరూ ఇంగ్లీష్ గ్రామర్ పై అవగాహన కలిగి ఉండాలి
- భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు
నవతెలంగాణ-భద్రాచలం
ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుపబడు తున్న ఆశ్రమ పాఠశాలు, వసతి గృహాలలో చదువు తున్న విద్యార్థినీ, విద్యార్థు లకు ఇంగ్లీషులో పూర్తిస్థాయి లో విద్యా బోధన నిర్వహించి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి పూర్తి సామర్ధ్యం ఉన్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి ముందస్తు ఇంగ్లీష్‌కు సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు అన్నారు. గురువారం భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో త్వరలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 20 ఆశ్రమ పాఠశాలలో 50 జిపి ఎస్ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోనికి కన్వర్ట్ అవుతున్నందున సంబంధిత ఉపాధ్యాయులందరికీ ఇంగ్లీషు మాధ్యమం శిక్షణ రెండు దఫాలుగా ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ముందస్తుగా భద్రాచలం, ఇల్లందు, ఖమ్మం జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని ఆయన అన్నారు. భద్రాచలంలో 12 మండలాల్లోని ఎస్జిటి, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలకు రెండు దఫాలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి కొన్ని సూచనలు ఇస్తూ విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో విద్యా బోధన ఎలా నిర్వహించాలో దానికి సంబంధించిన అంశాలను ఆయన పూర్తి స్థాయిలో విశదీకరించి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందరూ ఇంగ్లీషుకు సంబంధించిన గ్రామరు పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం బీఈడీ కళాశాల ఆవరణంలోని పరిస రాలను ఆయన పరిశీలించి విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. ఏమైనా కళాశాలకు సంబంధించిన మరమ్మతులు ఉంటే ప్రతి పాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్య క్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఏసిఎమ్ఓ రమణయ్య, భద్రాచలం ఏటిడివో నరసింహారావు, బిఈడి కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి సంబంధిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఖమ్మంలో జరుగు తున్న శిక్షణ కేంద్రంలో ఖమ్మం డిటిడిఓ కృష్ణా నాయక్, ఏసీఎం ఓ రాములు, ఇల్లందులో జరుగుతున్న శిక్షణ కేంద్రంలో అసిస్టెంట్ ఏసీఎం ఓఓ బావ సింగ్ తదితరులు బాధ్యత వహిస్తున్నారని ఆయన అన్నారు.