Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలంను టెంపుల్ సిటీ గా మార్చాలి
- రాజ్యసభ మాజీ సభ్యులు వి.హెచ్ హనుమంత రావు
నవ తెలంగాణ-భద్రాచలం
భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాజ్యసభ మాజీ సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ హనుమంత రావు, మాజీ మంత్రివర్యులు, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ లు గురువారం దర్శించుకున్నారు. భద్రాచలం విచ్చేసిన వీహెచ్ హనుమంతరావు, సంభాని చంద్ర శేఖర్‌లకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశాల మేరకు భద్రాచల కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌లోకి వెళ్ళిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆయన అన్నారు. ఐదు గ్రామపంచాయతీల కోసం సీఎం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి, తెలం గాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావులతో మాట్లాడి అవసరమైతే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. అదే విధంగా సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఐదు గ్రామపంచాయతీలు ఆంధ్ర ప్రదేశ్‌లో ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయ న అన్నారు. దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం పట్టణాన్ని టెంపుల్ సిటీ గా మార్చాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు కట్టా సీతారాములు, టిపిసిసి సభ్యులు ఎడవల్లి కృష్ణ, భద్రాచలం ఏ బ్లాక్ అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇందల రమేష్, తాళ్ల పల్లి రమేష్ గౌడ్, అడబాల వెంకటేశ్వర రావు, వెంకట్ కృష్ణార్జున రావు, గండేపల్లి హనుమంత రావు, బండి గంగరాజు పాల్గొన్నారు.