Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రానున్న ఎన్నికల్లో ఐదు స్థానాలలో టీఆర్ఎస్ గెలుపు తథ్యం
- ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
నవతెలంగాణ-భద్రాచలం
రానున్న ఎన్నికల్లో ఐదు స్థానాలలో టీఆర్ఎస్ గెలుపు తథ్యం టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్ నందు పట్టణ టీఆర్ఎస్ పార్టీ సమావేశం భద్రాచలం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజక వర్గాలలో స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన అన్నారు. అందుకోసం, కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేయాలన్నారు. అందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తానని ఆయన అన్నారు. జిల్లాలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి వేగవంతంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెళ్ళ తిరుపతిరావు, కృష్ణమూర్తి, భద్రాచలం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.