Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు
నవతెలంగాణ-కొత్తగూడెం
మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె దేశభక్తి యుత సమ్మె అని, ఈ సమ్మెను అన్ని వర్గాల ప్రజలు బలపరచాలని, కార్మిక వర్గం పెద్దసంఖ్యలో పాల్గని జయప్రదం చేయాలని సిఐటియూ జాతీయ ఉపాధ్యక్షులు యం.సాయిబాబు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక మంచికంటి భవనంలో సిఐటియూ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడారు. దేశ సంపదను కార్పోరేట్లకు అప్పగించాలనే మోదీ ప్రభుత్వ పెట్టుబడిదారి అనుకూల సిద్దాంతానికి, దేశ సంపద ప్రభుత్వ రంగంలో వుండి దేశ ఆర్ధిక సామాజిక ప్రగతికి ఉపయోగ పడాలనే కార్మిక వర్గ సిద్ధాంతానికి మద్య జరుగుతున్న పోరాటంలో భాగంగా రెండు రోజుల సమ్మె జరుగుతుందని అన్నారు. దేశ భవిష్యత్, ప్రజాసంక్షేమం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం కార్మికవర్గం సమ్మె చేస్తుందన్నారు. కార్మికవర్గం పోరాడి సాదించుకున్న హక్కులను కేంద్ర బిజేపి ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు.
కనీసవేతనాలు పెంచాలి- పాలడుగు భాస్కర్
కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని సిఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్ధుచేయాలన్నారు. మార్చి 28, 29 జరిగే సమ్మెకు 500 రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పోరాటలన్నింటికీ ఎస్కేఎం మద్దతు ఇచ్చిందని ఆరెండు రోజులు గ్రామీణ భారత్ బంద్‌కి పిలుపు నిచ్చాయన్నారు. కేంద్రా బిజేపి విధానాలపై పోరాడుతామని చెపుతున్న రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమ్మెను బలపరచాలని తద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలపై తాను చేసే పోరాటంలో నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. సింగరేణి, ఆర్టిసీలలో వున్న టిఆర్ఎస్ అనుకూల సంఘాలు కూడా సమ్మెలో భాస్వామలుకావాలని వారిని సమ్మె పోరాటంలోకి రావాలని సిఐటియూ కోరుతుందని భాస్కర్ తెలిపారు. జిల్లాలోగల అన్నీ పరిశ్రమలు, స్కీమ్ వర్కర్లు, అసంఘటిత రంగం, ప్రైవేటు ట్రాన్స్ పోర్టు, నిర్మాణ రంగం సహా అన్నీ రంగాలలో సమ్మె నూరుశాతం జరిగే విధంగా సిఐటియూ సభ్యులు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జిల్లా సిఐటియూ అధ్యక్షులు యం.వి అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియూ రాష్ట్ర కార్యదర్శులు మందా నరిసింహారావు, బి.మధు, జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్, కోశాధికారి జి.పద్మ, జిల్లా ఆఫీస్ బేరర్లు కె.బ్రహ్మాచారి, కొండపల్లి శ్రీధర్, గద్దల శ్రీను, వెంకటమ్మ, అర్జున్, వెంకట రామారావు, నాయకులు, నభీ, మండల కన్వీనర్లు, డి.వీరన్న, చిలకమ్మ, రాధాకుమారి, రాంబాబు, ఝాన్సీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు