Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం లీగల్ : ఖమ్మం పట్టణం, బల్లేపల్లికి చెందిన పురుగు మందుల వ్యాపారి మీగడ శ్రీనివాస్ స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒక కోటి 47 లక్షల 85 వేల రూపాయలకు మొత్తం 41 మందిని ప్రతివాదులుగా చూపిస్తూ గురువారం దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. వివరాలు పిర్యాది దారుడు 2015లో ఖమ్మం పట్టణం, పొట్టి శ్రీరాములు రోడ్డులో, గార్లలో శ్రీ విద్య ఎంటర్ ప్రెజస్ పేరుతో పురుగు మందుల వ్యాపారాన్ని చేసినాడు. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం బంధువులు దగ్గర, స్నేహితులు దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసినాడు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక ప్రతివాదుల నుండి ఒత్తిడి అధికమవడంతో తన న్యాయవాది మలీదు నాగేశ్వరరావు ద్వారా ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేశాడు.