Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే పాఠశాలల్లో సౌకర్యాలు కల్పన
- ప్రతీ పాఠశాలలో గ్రంధాలయం ఏర్పాటు
- పుస్తక పఠనం చదువుపై ఆశక్తి పెంచుతుంది
నవతెలంగాణ - అశ్వారావుపేట
విద్యాభివృద్ధే ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని, అందుకోసమే మన ఊరు - మన బడి పధకం ద్వారా పల్లెల పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రతీ పాఠశాలలో గ్రంధాలయం ఉండి అందులో విభిన్నమైన పుస్తకాలు ఉంటే విద్యార్ధుల్లో పఠనాసక్తి పెరిగి చదువు పై శ్రద్ధ పెడతారని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ''మన ఊరు - మన బడి'' ప్రణాళిక రూపకల్పనలో చివరి దశలో ఉన్నందున ఆయన మండలంలో ఈ పథకానికి ఎంపికైన మూడు పాఠశాలలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా నారంవారిగూడెం ప్రాధమికోన్నత పాఠశాలలో చెట్టుకింద బోధిస్తున్న దృశ్యాన్ని కారణం అడిగారు. 8 తరగతులు 4 గదులు మాత్రమే ఉన్నాయని ఇంచార్జి ఎచ్.ఎం ఎం.వెంకటేశ్వర్లు తెలపడంతో వెంటనే అదనపు గదులకు అంచనా ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. పేరాయిగూడెం పంచాయతీ నెహ్రూ నగర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ పాఠశాల ప్రాంగణంలో ఉన్న విద్యుత్ స్థంభం విద్యార్ధులకు ఆటంకంగా మారిందని ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాసరావు ఆయన దృష్టికి తెచ్చిన వెంటనే స్థంభం తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
జిల్లా పరిషత్ ఉన్నత బాలురు పాఠశాలను సందర్శించి ''మన ఊరి - మన బడి'' పధకంలోని 12 అంశాలను పాఠశాల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ అధికారులతో దగ్గరుండి పని చేయించుకోవాలని ప్రధానోపాధ్యా యుడు పత్తేపరపు రాంబాబు కూ సూచించారు. ఈ పాఠశాలలో బోధిస్తున్న డిజిటల్ ఎడ్యుకేషన్ వీక్షించారు. ఎలా బోధిస్తున్నారు,విద్యార్ధులు ఎలా స్పందిస్తున్నారని గణిత శాస్త్రం ఉపాధ్యాయుడు అప్పారావును అడిగి తెలుసుకున్నారు. అదే సందర్భంలో ఓ విద్యార్ధి నోట్ బుక్ ను పరీక్షించి అతని రాత విధానం నచ్చి విద్యార్ధిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పిల్లల్లో పఠనాసక్తి పెంపొందించేలా బోధన ఉండాలని, లోకజ్ఞానం పెరిగితే విద్యార్ధులు చదువులో రానిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చల్లా ప్రసాద్, ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య, ఐ.బి డి.ఇ ఎల్.క్రిష్ణ, ఎ.ఇ కె.ఎన్.బి క్రిష్ణ, ఎం.డి.ఒ విద్యాధర్‌రావు, ఇ.ఒ హరిక్రిష్ణ, సర్పంచ్‌లు మనుగొండ వెంకట ముత్యం, నార్లపాటి సుమతి, అట్టం రమ్య లు పాల్గొన్నారు.