Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగ యువతకు అధిక నిధులు కేటాయించాలి
డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షులు విజయ్‌కుమార్
ఖమ్మం : దేశంలో, రాష్ట్రంలో మోడీ, కేసీఆర్ హయాంలోనే నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో పెరిగిపోయిందని, రానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై అధిక నిధులు కేటాయించాలని డివైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక యన్‌యస్‌పి క్యాంప్ సుందరయ్య భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అధ్యక్షతన డివై యఫ్ఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. ఏడున్నర సంవత్సరాల కాలంలో మోడీ, కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీలు కనీసం అమలుకి నోచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న బడ్జెట్ సమావేశాలలో టిఆర్‌యస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని, నోటిఫికేషన్లను ఇచ్చే విధంగా రూపకల్పన చేసి అధిక నిధులను కేటాయించాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికలలో బీజేపీ, టిఆర్‌యస్ ప్రభుత్వాలను ఓడించడానికి నిరుద్యోగ యువత సిద్ధం అవుతారని ఆయన తెలిపారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి అనిగంటి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగులకు అధిక నిధులు కేటాయించి, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోమలు, పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ బసీరుద్దీన్, లిక్కి బాలరాజు, సనాది భాస్కర్, శివవర్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి నవీన్, మల్లం మహేష్, రాజు, గడ్డం వెంకటేష్, ఖమ్మం జిల్లా ఆఫీస్ బేరర్స్ మద్దాల ప్రభాకర్, చింతల రమేష్, సత్తెనపల్లి నరేష్, శీలం వీరబాబు, భూక్య ఉపేందర్ నాయక్, షేక్ రోషన్ బేగ్, రోష్ని ఖాన్, గుమ్మా ముత్తరావు, ఇంట్లురి అశోక్, దిండు మంగపతి తదితరులు పాల్గొన్నారు.