Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే సీపీఎం లక్ష్యమని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో సీపీఎం ఖమ్మం రూరల్ మండల జనరల్ బాడీ సమావేశం యామిని ఉపేందర్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.ఈ జనరల్ బాడీ సమావేశంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. దేశంలో మత కల్లోహాలు సృష్టించి పబ్బం గడుపుకోవడమే బీజేపీ ఎజెండా అన్నారు. బీజేపీని రాబోయే ఎన్నికల్లో ఓడించేందుకే దేశంలోని లౌకిక శక్తులతో కలుస్తామన్నారు. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కన్నురూలో నిర్వహించనున్న సీపీఎం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రష్యా,ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం అమెరికా స్వార్థం కోసం జరుగుతున్న యుద్ధం అన్నారు. ఉక్రెయిన్లో ఉన్న మనదేశ పౌరుల్ని యుద్ధానికి ముందే మన దేశానికి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని, దీని వల్ల పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నా మన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, జిల్లా నాయకులు ఉరడీ సుదర్శన్ రెడ్డి, నందిగామ కృష్ణ, పెండ్యాల సుమతి, భూక్య నాగేశ్వరరావు, నర్సింహా రావు, కారుమంచి గురవయ్య, పల్లె శ్రీనివాసరావు, మంగ, సాల్వే వెంకటేశ్వర్లు, కర్లపూడి సుభద్ర, ఏపూరి వర కుమార్, పాపిట్ల సత్యనారాయణ, పెంట్యాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.