Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషన్ వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాల దోపిడీ
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం ఏఎంసి మార్కెట్లో మిర్చి రేట్ తగ్గింపుపై రైతులు ఆందోళన నిర్వహించారు. గత రెండు రోజుల తర్వాత మార్కెట్ తెరుచుకోవడంతో రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు తెచ్చారు. గత వారంలో మార్కెట్కు బస్తాలు ఎక్కువ వచ్చినప్పటికీ ధర మాత్రం రూ.19 వేల వరకు ఉంది. గురువారం తక్కువ బస్తాలు వచ్చినప్పటికీ జెండా పాటగా రూ.18,300లు కేటాయించారు. సరైన ధర కేటాయించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మార్కెట్లోని కమిషన్ వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు కుమ్మకై తక్కువ రేటుకు అడిగి మోసగిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. జెండా పాట నిర్వహణలో మార్కెట్ సెక్రెటరీ, ఛైర్మెన్ సిబ్బంది లేకుండా ధర నిర్ణయించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో త్రీ టౌన్ పోలీస్లు వచ్చి వారికి సర్దిచెప్పి శాంతిపజేయడంతో సుఖంతమైంది.