Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
డబల్ బెడ్రూమ్ ఇల్లు దక్కలేదని పాతర్ల పాడు గ్రామంలో పలువురు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పాతర్ల పాడు గ్రామంలో నిర్మించిన 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కొరకు ఇటీవలే లాటరీ పద్ధతి ద్వారా గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు నిరుపేదలైన తమకు అన్యాయం జరిగిందని పలువురు ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 20 మంది మహిళలు గురువారం మధ్యాహ్నం వాటర్ ట్యాంకు ఎక్కి తమకు ఇల్లు కేటాయించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న తాసిల్దార్ మంగీలాల్ ఎస్ఐ పొదిలి వెంకన్న అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన గురించి వాటర్ ట్యాంక్ దిగారు. ఆరు గంటలపాటు వాటర్ ట్యాంక్ ఎక్కి కనీసం తమకు ఇళ్ల స్థలాలు అయినా కేటాయించాలని అధికారులను కోరారు.