Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధంతో సామాన్య ప్రజానీకం సతమతం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్
నవతెలంగాణ- నేలకొండపల్లి
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధానికి ప్రధాన కుట్రదారి అమెరికా అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక రావెళ్ళ భవనంలో పార్టీ నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు అధ్యక్షతన పార్టీ మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రపంచ సామ్రాజ్యవాద ఆధిపత్య దేశంగా పేరు గాంచిన అమెరికా తనకు వ్యతిరేకంగా అన్ని రంగాలలో పైచేయిగా నిలుస్తున్న చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు పరోక్షంగా ఉక్రెయిన్ను రష్యాపై యుద్ధానికి పురికొల్పింది అన్నారు. అమెరికా ఆధిపత్యాన్ని అధిగమించేలా చైనా నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 దేశాలలో 150 దేశాలలో తన వాణిజ్య వ్యాపారాలతో విస్తరించి సత్సంబంధాలను పెంచుకోకలిగిందన్నారు. చైనా తన 140 కోట్ల జనాభాలో 30 కోట్ల మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఉచిత విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ మధ్యతరగతి స్థాయికి చేర్చి ప్రపంచ దేశాలకు సవాల్ గా నిలిచింది అన్నారు. దీనిని జీర్ణించుకోలేని అమెరికా ఉక్రెయిన్ సాయంతో నాటో దళాలను రష్యాలో విస్తరించేందుకు కుట్ర చేస్తుందన్నారు. నాటో కూటమిలో చేరకుండా ఉక్రెయిన్ తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలన్నారు. తక్షణమే రెండు దేశాలు శాంతి చర్చల ద్వారా యుద్ధాన్ని నిలిపివేయాలని కోరారు. రానున్న కాలంలో మతతత్వ బిజెపిని ఓడించడమే లక్ష్యంగా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను ఏకం చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, నాయకులు రచ్చ నరసింహారావు, రాసాల కనకయ్య, కట్టెకోల వెంకన్న, భూక్య కష్ణ, బెల్లం లక్ష్మి, సిరికొండ ఉమామహేశ్వరి, మారుతి కొండలరావు, ఎడ్ల తిరుపతిరావు, బండి రామమూర్తి, డేగల వెంకటేశ్వరరావు, ఎరదేశి నరసింహారావు, గుగులోతు వీరు, శీలం అప్పారావ్, శివరాజు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెంలో రాస్తారోకో
తిరుమలాయపాలెం: ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలన్నా కోరికతో అమెరికా సామ్రాజ్యవాదంలో భాగంగా ఉక్రెయిన్ను ఉసి గొలిపి రష్యాతో కవ్వింపు చర్యలు చేయడం వల్ల యుద్ధం వచ్చిందని, ఖచ్చితంగా అమెరికా సామ్రాజ్యవాద యుద్ధ మేనని అందుకే వెంటనే యుద్ధం ఆపి చర్చ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్ అన్నారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం- తొర్రూరు ప్రధాన రహదారిపై ''యుద్ధం వద్దు శాంతి ముద్దు...సామ్రాజ్యవాదం నశించాలి'' అంటూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మండల నాయకులు అంగిరేకుల నరసయ్య అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బింగి రమేష్, తుళ్లూరి నాగేశ్వరావు, పద్మనాభుల సుధాకర్, వేగినాటి వెంకట్రావు, నాయకులు మహేందర్, ఉపేందర్, నాగేశ్వరరావు, వీరన్న, పుష్పమ్మ, ఉపేందర్, రవి, వెంకటేష్ పాల్గొన్నారు.