Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
గామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా అక్షరాస్యత సాధించి ముందంజలో ఉండాలని ముదిగొండ ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్ కొమ్ము రమేష్ బాబు అన్నారు. మండలపరిధిలో యడవల్లి గ్రామంలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యతపై గ్రామప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఏపీజివిబి సేవలపై కళాజాతను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ చెరుకుపల్లి వెంకటేశ్వర్లు, ఎఫ్ఎల్సి మోహన్ రావు, ఉపసర్పంచ్ ఎస్కే మహబూబ్ పాష, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్స్ జోగారెడ్డి, ప్రవీణ్ బ్యాంక్ మిత్రులు ఎస్కే పర్వీన్, చెరుకూరి కళ్యాణి, ఇనప నాగరాజు, చిలుకూరు ప్రమీల, మయూరి, గ్రామదీపిక, డ్వాక్రా మహిళలు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.