Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం సొసైటీ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ నుండి వీరహనుమంతరావు, లక్ష్మీదేవిపల్లి మండల ఎంపిపి భూక్యా సోనా, మార్క్ట్ యార్డు చైర్మన్ భూక్యా రాంబాబు, మార్క్ ఫేడ్ డిఎం సునితా చేతుల మీదుగా కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కందుల కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ మద్దతు ధరకు కందుల కొనుగూలు కేంద్రంను మార్కెట్ యార్డు ప్రారంభించటం జరిగిందన్నారు. కంది సాగుచేసిన రైతులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.6,300లుగా మద్దతు ధర పొందాలంటే తప్పనిసరిగా కందులను శుద్రపరచి తీసుకురావాలని, అలాగే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పట్టాదారు పుస్తకము జిరాక్స్లు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్నాద రావు, లక్ష్మీదేవిపల్లి మండల ఎంపిటీసి భద్రమ్మ, సర్పంచ్ పద్మ, మార్క్ట్ సెక్రటరీ ఇ.నరేశ్ కుమార్, సొసైటీ డైరెక్టర్ వేల్పుల మల్లేష్, కర్నాటకపు రాంచందర్, తీట్ల విజయకుమారి, పోటు వెంకటేశ్వరరావు, మాలోతు సివ్యా, రైతులు పాల్గొన్నారు.