Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
ఏజెన్సీలో ఫారెస్ట్ దాడులు ఆపాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు మడివి రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పినపాకలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ సమావేశం దుబ్బ గోవర్ధన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పాయం నరసింహారావు మాట్లాడుతూ ఏజెన్సీలో అటవీశాఖ అధికారులు ఆదివాసులు సాగుచేసుకుంటున్న పోడు భూములను దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నారన్నారు. పట్టాలు ఇస్తారా ఇవ్వరా ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే పోడు భూమి సమస్య కోసం మండలంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా మహాసభలు జరుపుతామని ఆయన అన్నారు. ఈ మహాసభలకు ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మడివి రమేష్, మండల కార్యదర్శి పూనెం నరసింహారావు, మండల కమిటీ సభ్యులు కబాక రమేష్, బాడిస నరసయ్య తదితరులు పాల్గొన్నారు.