Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 28,29న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఈసం వెంకటమ్మ, సీఐటీయూ ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబిపిలుపునిచ్చారు. స్థానిక కార్యా లయంలో శుక్రవారం మండల కమిటీ సమావేశం మరియా అధ్యక్షతన జరిగిం ది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరి స్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాలు బీఎమ్మెస్ మినహా మరియు వివిధ రంగాల ఉద్యోగ సంఘా ల అఖిల భారత ఫెడరేషన్లు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ రెండు రోజులలో గ్రామీణ బందుకు పిలుపు నిచ్చాయి. ఈ సమ్మె జయప్రదం కోసం అనేక రూపాలలో ప్రచారం చేసి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో తాళ్లూరి కృష్ణ, మరియ, ఈసం పద్మ, బోలెం లక్ష్మీ, జయమ్మ, వీరయ్య, కామ నాగరాజు, సత్యనారాయణ కోరి తదితరులు పాల్గొన్నారు.