Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
- గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఒక్క రోజు దీక్ష
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్స్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తు గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఒక్క రోజు దీక్ష నిర్వహించారు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకుల మాట్లాడారు. 665 బదిలీ వర్కర్ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం అఖిల భారత ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పరిరక్షణ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం 10 జూన్ 2018 665 బదిలీ వర్కర్ ఉగ్యోగల కై గిరిజన అభ్యర్థులు వ్రాసి ఉన్నారని, వ్రాత పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏజెన్సీలో సింగరేణి కార్యకలాపాలు స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. షాబీర్పాషలు, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాలశౌరి, ఆదివాసీ సంఘా జేఏసీ నాయకుల వాసం రామకృష్ణ దొర, గుగులోత్ రాజేష్నాయక్, బానోత్ రమేష్, కొమరం బుచ్చయ్య, జిల్లా మాల మహనాడు అధ్యక్షులు పూల రవిందర్, కాపు కృష్ణ, భూక్యా రుక్మిణి, రజాక్, సోమిరెడ్డి, శ్రీనివాస్, సంఘీభావం తెలిపారు. దీక్షలో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ ఉపా ద్యాక్షులు గోళ్ల రమేష్, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు భానోత్ కర్ణ, అఖిల భారత ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ సం ఘం ( సింగరేణి) అధ్యక్షులు రాసూరి శంకర్, ప్రధాన కార్యదర్శి గుగులోద్ కోదండరామ్ పాల్గొన్నారు.