Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ మిడియం బాబూరావు
నవతెలంగాణ-చర్ల
స్వతంత్ర భారతావనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరు పేద ప్రజల స్వేచ్ఛని నానాటికి హరిస్తున్నాయని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం బాబురావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దానవాయి పేట గ్రామంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండ చరణ్ అధ్యక్షతన జరిగిన వైస్ ఎంపీపీ కామ్రేడ్ కుంజా చిన్నక్క ప్రధమ వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్నక్క మృతి చెంది సంవత్సరం కాలం గడిచినా ఆమె పాల్గొన్న పోరాటాలు అందరికీ అందుబాటులో ఉంటూ నిరుపేదల కష్టాలను తీర్చి క్షణక్షణం అందరి మదిలో మెలగగలధని ఆయన తెలిపారు. చిన్నక్క పార్టీ పెరుగుదలకు నిరంతరం కృషి చేశారన్నారు. అహర్నిశలు నిబద్ధతతో పార్టీ పురోగతికి పాటుపడిన చిన్నక్క భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆమె ఆశయాలు, ఆమె ప్రజా సంక్షేమ పథకాల కోసం పోరాడిన పోరాటాలు మన మధ్యనే కదలాడుతున్నాయని జిల్లా కమిటీ సభ్యులు కే.బ్రహ్మచారి అన్నారు. తొలుత చిన్నక్క చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ కొత్తగూడెం ప్రధాన సెంటర్లో ఉన్న చిన్నక్క స్ధూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొనుపుగంటి సమ్మక్క, బోళ్ల వినోద్, కుంజా వెంకటేశ్వర్లు, కారం నరేష్, మచ్చా రామారావు, కుర్నపల్లి ఎంపీటీసీ రామారావు, శిరోని, సత్తిష్, గిరిజన సంఘం నా యకులు నాగేశ్వరరావు, చిన్నక్క కుటుంబ సభ్యులు బంధువులు, పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.