Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్చే ప్రారంభోత్సవం
- పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు రూ. 21 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. శుక్రవారం భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ జిహెచ్ఎంసి కార్యాలయం తర్వాత ఖమ్మంలోనే ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక డిజైన్తో ఉద్యోగులు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతు న్నామన్నారు. సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కార్యాలయ నిర్మాణ పనులు మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అతిత్వరలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించ నున్నామని తెలిపారు. రిసెప్షన్ కౌంటర్, ఇంజనీరింగ్, మీ సేవ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. కౌన్సిల్ సమావేశాల నిమిత్తం 150 మంది కూర్చునేందుకు విశాలమైన పెద్ద హల్, డ్యుయల్ కుషన్ సీటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్, సెంట్రల్ ఏసీ తదితర సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరపాలక సంస్థకు ఏటా రూ.100 కోట్లు నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని, ఈ నిధులతో అంతర్గత రహదారులు, మంచినీటి వసతి, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రతిపాదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని, గ్రేటర్ తరహాలో కార్పొరేషన్ కార్యాలయ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజరు కుమార్, ఎస్ఈ ఆంజనేయులు, ఈఈ కృష్ణాలాల్, డిఈ రంగారావు, కార్పొరేటర్లు తదితరులు అన్నారు.