Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
- బొంతు రాంబాబు.
నవతెలంగాణ - వైరా టౌన్
మార్చినెల రెండోవారంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో వైరా రిజర్వాయర్ ఆయకట్టు, సాగునీటి కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం వైరా సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో గాలి అరుణ అధ్యక్షతన సిపిఐ(ఎం) వైరా మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ జపాన్ ఆర్థిక సహాయంతో వైరా రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు ప్రారంభించి సగం పూర్తి చేయడం జరిగిందని, మిగితా ఆయకట్టు సాగునీటి కాలువల ఆధునికీకరణ పనులు జరగకపోవడం వలన ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందటం లేదని, పంట కాలువలు దశాబ్దాల పాటు పూర్తి స్థాయిలో మరమ్మతులు సరిగా లేకపోవడం వలన సాగు నీరు వధా అవుతుందని, పంట కాలువలు మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరారు. సిపిఐ(ఎం) జిల్లా రాజకీయ విద్యా విభాగం సభ్యులు బోడపట్ల రవీందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పోరేటీకరణ విధానాలను ప్రజలకు వివరించి ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని కోరారు, దేశంలో మితవాద శక్తులు, కార్పోరేట్ సంస్థలు బలమైన బంధం ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ సంస్థలపైన దాడి చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, తూము సుధాకర్, మండల కమిటీ సభ్యులు ద్రొణాదుల నాగేశ్వరరావు, ఎస్.కె మజీద్, ఎస్.కె జానిమీయా, బాణాల కృష్ణమాచారి, ఎస్.కె షేనాబీ, బిలాల్, గరిడేపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు