Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ను జిల్లా ఎంపిజె అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం తన బృందంతో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా, 2015-16 నుండి రాష్ట్రంలో మైనారిటీ ఋణాలు మంజూరు కావడం లేదని, దీనివలన మైనారిటీ పేదలు అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి వలన ఎంతో మంది మైనారిటీల స్థితిగతులు దిగజారి పోయి, అధిక వడ్డీలకు అవసరాలు తీర్చు ుంటూ, అప్పుల పాలై పోతున్నారన్నారు. ఈ సారి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీల అభివృద్ధి కోసం అధిక కేటాయింపులు జరిపి, ఋణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి, చిరు వ్యాపారులను, యువతను ఆదుకోవాలని, ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఋణాలు మైనారిటీలలో అన్ని వర్గాల వారికి మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్జిఓస్ జిల్లా ప్రెసిడెంట్ అఫ్జల్ హసన్, ఎంపిజె కార్యదర్శి రజబాలి, కోశాధికారి హకీం, సభ్యులు గఫార్, పాషా, జాని తదితరులు పాల్గొన్నారు.