Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రవాస భారతీయుడు నన్నపనేని మోహన్
నవతెలంగాణ-భద్రాచలం
విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ప్రవాస భారతీయుడు, నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి నన్నపనేని మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవడానికి తరగతిగది పుస్తకాన్ని ఆధారం తీసుకోకుండా, తనకు తానే అన్వేషణ ద్వారా అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవాలని అన్నారు. పదవ తరగతి విద్యా ర్థులతో మాట్లాడుతూ తల్లి దండ్రుల కష్టాన్ని గుర్తించాలని, విద్య ద్వారా తాను అభివృద్ధి చెంది తన చుట్టూ ఉన్న వారిని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. తాను భద్రాచలంలో విద్యార్థిగా ఉన్నప్పుడు గ్రంథాలయాలలో పుస్తకాలు విరివిగా చదివేవాడిని అందువల్లనే ఈనాడు మీముందు వాటి గురించి మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి.పి.ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.