Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి
నవతెలంగాణ- సత్తుపల్లి
మహిళా సాధికారిత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తపన పడుతున్నారని ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ పిలుపులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదేశాల మేరకు మండలంలోని నారాయణపురం గ్రామంలో సోమవారం మహిళా బంధు సంబురాలను పండువలా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హరికృష్ణారెడ్డి మాట్లాడారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సారధ్యంలో మహిళాభివృద్ధి కోసం అనేక సంక్షేమ, సంరక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నాన్నారు. కేసీఆర్ చిత్రపటాలకు మహిళలు రాఖీలు కట్టారు. జయహౌ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్న మహిళలను మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేశిరెడ్డి రంగారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు మందపాటి వెంకటరెడ్డి, ఎంపీటీసీ తుంబూరు కృష్ణారెడ్డి, నాయకులు చంద్రం, ఉమామహేశ్వరరావు, గోపీ, సురేశ్, ఈశ్వర్, లింగారెడ్డి పాల్గొన్నారు. మహిళాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి పంచారు.