Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వనాధపల్లిలో ఆత్మ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ, పారిశుధ్య కార్మికులను ఎంపీపీ మాలోత్ శకుంతల శాలువతో సన్మానం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షప్రధానకార్యదర్శులు తోటకూరి రాంబాబు, సర్పంచ్లు మాలోత్ కిషోర్, ఆదెర్ల స్రవంతి, అజ్మీర నరేష్, బానోత్ కుమార్, ఎంపీటీసీలు ఇమ్మడి రమాదేవి, పెద్దబోయిన ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.