Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
మహిళలు తమ హక్కులు పరిరక్షించుకోవాలని నేలకొండపల్లి ఎస్ఐ స్రవంతి అన్నారు. నేలకొండపల్లి సేవ మహిళా మండలి, భక్త రామదాసు సర్వీస్ సొసైటీ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు గత రెండు రోజులుగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ముగింపు సభలో ఎస్సై స్రవంతి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సేవ మహిళా మండలి అధ్యక్షురాలు మచ్చ రేణుక అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ మహిళలు తమ పిల్లల పెంపకం పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పిల్లలకు సామాజిక విలువలు, కుటుంబ బాధ్యతలను తెలియజే యాలన్నారు. కార్యక్రమంలో స్థానిక మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ పరంజ్యోతి, మణి, ఏపీఓ ఆర్ సునీత, ఏపీఎం అశోక్ రాణి, భక్త రామదాసు సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఎలమద్ది లెనిన్, కార్యదర్శి పాలడుగు పూర్ణ చంద్ర ప్రసాద్, కోశాధికారి యుగంధర్, మాజీ అధ్యక్షులు నెల్లూరి వీరబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, వల్లంచెట్ల భాస్కరరావు, గెల్లా జగన్ మోహన్ రావు, చావా గణపతి, కొంగర నారాయణరావు, సేవ మహిళా మండలి కార్యదర్శి కొంగర ప్రభావతి, జ్వాల పాల్గొన్నారు.