Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కెసిఆర్ మహిళా బంధు కార్యక్రమమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే శ్రీ లావుడ్య రాములు నాయక్ జిల్లా తెరాస అధ్యక్షుడు,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆదేశాల మేరకు మూడు రోజులు జరిగే ఉత్సవాల్లో భాగంగా మండల పార్టీ అధ్యక్షుడు వై.చిరం జీవి, జడ్పీటీసీ పోట్ల కవిత ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు, వితంతువులకు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ గాజులు తాంబూలం స్వీట్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా తెరాస నాయకులు పోట్ల శ్రీనివాస్‌రావు, కో ఆప్షన్ నెంబర్ మౌలానా, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు మాధవరావు, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, ఎస్టీ సెల్ కార్యదర్శి భూక్యా నరసింహ నాయక్, సర్పంచులు దొండపాటి లక్ష్మి, చిలుకూరు నాగేంద్ర, కాంపల్లి స్వప్న, ముత్యాల నాగమణి, బానోత్ దేవి నాగామని, కొర్ర కాంతమ్మ లకావత్ నీలా, బానోత్ మాన్సింగ్, మాజీ సొసైటీ చైర్మన్ పాసంగులపాటి శ్రీను, తెరాస మండల నాయకులు కెవి కె.వెంకట లాలయ్య, తదితరులు పాల్గొన్నారు.