Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక అధికారులు లబ్ధిదారులకు
- పూర్తి అవగాహన కల్పించాలి : కలెక్టర్
నవతెలంగాణ- చింతకాని
దళిత బంధు పథకం యూనిట్ ఎంపిక నిర్ణయం లబ్ధిదారులదేనని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పేర్కొన్నారు. చింతకాని మండలం దళిత బంధు పథకంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన నేపథ్యంలో ప్రొద్దుటూరు నగిలిగొండ గ్రామాల్లో దళిత బందు లబ్ధిదారులకు సోమవారం కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు ద్వారా నైపుణ్యత అనుభవం కలిగిన యూనిట్లను స్థాపించుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి దళితులు ఎదగాలన్నది ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతం ప్రొద్దుటూరు దళితవాడలో పలు గృహాలను సందర్శించి వారికి అవగాహన కల్పించారు. రైతు వేదికలో నాగిలిగొండ లబ్ధిదారులకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ డిడి సత్యనారాయణ ఆర్డిఓ రవీంద్రనాథ్ డి ఎస్ డి ఓ పరంధామ రెడ్డి ఇ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ ఎంపీటీసీ భారతమ్మ ప్రొద్దుటూరు నాగిలిగొండ సర్పంచులు రాజేష్ చాట్ల సురేష్, ఎంపీడీవో రవికుమార్ తాసిల్దార్ మంగీలాల్ ఎంపీవో రవీంద్ర ప్రసాద్ పంచాయతీ కార్యదర్శులు ప్రణీత అనిల్ కుమార్ లబ్ధిదారులు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య పాల్గొన్నారు.