Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చింతకాని
విలేజ్ విజిట్ పోగ్రామ్లో భాగంగా నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు అనంతసాగర్ గ్రామాన్ని సందర్శించడం జరిగినది. వీరు గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు పల్లె ప్రగతి గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు నర్సరీ వైకుంఠధామం సంబంధించి వివరాలు తెలుసుకొని గ్రామంలో కలియతిరిగి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడం జరిగింది. పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామస్తుల నుండి పలు విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి.రవి కుమార్, మండల పంచాయతీ అధికారి రవీంద్ర ప్రసాద్, గ్రామ సర్పంచ్ నూతలపాటి మంగతాయమ్మ, ఉప సర్పంచ్ సారిక వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి కోటేశ్వరీ పాల్గొన్నారు.