Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన మేయర్ నీరజ
నవతెలంగాణ- ఖమ్మం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రెండవ రోజు నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంను ఖమ్మం నగర మేయర్ పూనుకొలు నీరజ జెండా ఊపి ప్రారంభించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అఫ్జల్ హసన్, ఆర్.వి.ఎస్.సాగర్ , మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాబాస్ జ్యోతి, ఇ.స్వప్నల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంతర శ్రామికులు మహిళలు ఓ వైపు కుటుంబ బాధ్యతను మోస్తూ, మరోవైపు ఉద్యోగ నిర్వహణలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరిం చడంలో కూడా మహిళల పాత్ర అమోఘం అన్నారు. టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే ప్రథమంగా ఇంత గొప్పగా ఆటలపోటీలు నిర్వహించడం అభినందనీ యమన్నారు. అనంతరం మహిళ విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.జ్యోతి, ఇ.స్వప్నలు మహిళ ఉద్యోగులు మేయర్ నీరజని శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ వైస్ ప్రెసిడెంట్ నందగిరి శ్రీను, దాసరి రవి కుమార్, కోశాధికారి భాగం పవన్, జిల్లా, టౌన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీలు బుద్దా రామకృష్ణ, ఆర్.ఎన్.ప్రసాద్, మహిళ విభాగం సెక్రెటరీలు కె.అశ్విని, ఉమారాణి, స్వప్న, ఖమ్మం టౌన్ అధ్యక్షులు సామినేని రఘు కుమార్, ఏఎంసి అధ్యక్షులు టి.కిరణ్ కుమార్, కరణ్ సింగ్, మెడికల్ అండ్ ఫోరమ్ అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు, అగ్రికల్చరల్ ఫోరమ్ అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.