Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి మాచర్ల, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మంలోని జిల్లా ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సదస్సు ఐద్వా జిల్లా అధ్యక్షులు బండి పద్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పిన్నింటి రమ్యల అధ్యక్షతన జరిగింది. తొలుత ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.
ఈ సదస్సులో వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా మహిళలపై పిల్లలపై అత్యాచారాలు, హత్యలు బాగా పెరిగాయి అన్నారు. పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలు వివక్షతకి గురతున్నారని, మహిళలకు సమాన పనికి సమాన వేతనం సమాన హక్కులు కోల్పోయ్యారని, పార్లమెంట్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిం చడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది అన్నారు. తినే ఆహారం మీద వేసుకునే దుస్తువులమీద ఆంక్షలు పెట్టడం దుర్మార్గం అన్నారు. మహిళందరికి కనీస వేతనం... పురుషులతో సమానంగా వేతనం చెల్లించాలని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఆఫిస్ బేరస్ పత్తిపాకా నాగసులోచన, మెహరున్నిసా బేగం, సీఐటీయూ ఆఫిస్ బేరర్ మాచర్ల గోపాల్, సంఘాల జిల్లా కమిటీ సభ్యులు కత్తుల అమరావతి, అజిత, ఫారిద, ముక్కపాటి నాగమణి, వంగూరి రమ, పందుల నాగమణి, నందిపాటి పావని, నాయకులు కనకలక్ష్మి రమ, మంగ, నాగారత్నం, ఉమా, రమణ, విజయ శ్యామలామ్మ, తదితరులు పాల్గొన్నారు.