Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో పంట నష్టంకు నిధులు కేటాయించాలి
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణ - వైరాటౌన్
గత నాలుగు సంవత్సరాలుగా రైతుల రుణాల మాఫీ సకాలంలో చేయకపోవడం వలన రైతులు బ్యాంకులకు అప్పులను గడువు తేదీలోపు తిరిగి చెల్లించక పోవడం వలన అధిక వడ్డీ భారం పడి అప్పులు ఊబిలోకి జారుకున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అన్నారు. సోమవారం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో జరిగిన తెలంగాణ రైతు సంఘం సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ కేసిఆర్ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేయడం వలన రుణం మాఫీ అవుతుందని, రైతులు బ్యాంకు వైపు తిరిగి చూడలేదని, దీని వలన బ్యాంకు అధికారులు అధిక వడ్డీ రేట్ల వేసి, లెక్కలు తిరగరాసి లక్ష రూపాయలకు మరో లక్ష రూపాయలు అదనపు అప్పు పెరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫా రైతు రుణాల మాఫీ చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో మరో 75 వేల రూపాయలు మేరకు ఈ సంవత్సరం చివరి నాటికి రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి రైతులపై భారం వేస్తుందన్నారు. రాష్ట్రంలో మిర్చి రైతులకు తామర వైరస్ ప్రభావం వలన నష్టం జరిగిందని, అధిక వర్షాల వలన రైతులకు నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కనీసం రైతులకు నష్టపరిహారం చెల్లించే ప్రయత్నం చేయలేదని, రైతు ప్రభుత్వం అంటూనే రైతులను ఆర్థికంగా దెబ్బతిస్తుందని, రైతులు రాష్ట్ర బడ్జెట్ సవరణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు హరి వెంకటేశ్వరరావు, మల్లెంపాటి ప్రసాదరావు, యనమద్ధి రామకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, వడ్లమూడి మధు తదితరులు పాల్గొన్నారు.