Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రైమరీ విద్యార్థుల, తల్లులకు వివిధ రకాల పన్నీ గేమ్స్ నిర్వహించామని త్రివేణి పాఠశాలల డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ అంజలి మాట్లాడుతూ మహిళలు జీవితం అనే నాటకంలో పలు పాత్రలకు జీవంపోసి, ఒక తల్లిగా బిడ్డకు జన్మనిచ్చి లాలించి, పాలించి, సోదరిగా అక్కున చేర్చుకొని మిత్రురాలిగా ఆదర్శ ప్రాయంగా నిలిచి, భార్యతోడు నీడగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమరో విద్యార్థుల తల్లులుపాల్గొని వివిధ రకాల పోటీలలో పాల్గొని బహుమతులు గెల్చుకున్నారు.కార్యక్రమంలో కృష్ణవేణి -త్రివేణి విద్యా సంస్థల అధిపతి వై వేంకటేశ్వరరావు, మురళీకృష్ణ, ప్రిన్సిపాల్ రాజేంద్రరరావు బీ సి.ఆర్.ఒ.ప్రసాద్ అకడమికి ఇంచార్జి ముస్తఫా , కిడ్స్ ఇంచార్జి శ్రీదేవి, ఐ.ఐ.టి. ఇంచార్జి అశోక్, క్యాంపనీ ఇంచార్జి చార్లెస్ , ట్రాన్స్పోర్ట్ ఇంచార్జి సందీప్ పాల్గొన్నారు.