Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన దళితులకు మాత్రమే దళిత బంధు వర్తింపజేయాలి
- ఏన్కూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు దళితుల ఆందోళన
నవతెలంగాణ-కొణిజర్ల(ఏన్కూర్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని పేదలందరికీ వర్తింపచేయాలని ఏన్కూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు దళితులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని కొందరు స్వార్ధపరులు.... మధ్యవర్తులు పక్కదారి పట్టించే అవకాశం ఉన్నందున రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి గ్రామంలో అర్హులైన పేద వారిని గుర్తించి దళిత బంధు పథకాన్ని అమలు అయ్యేలా చూడాలని కోరుతూ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన దళిత మహిళలు యువకులు పాల్గొని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం వైరా నియోజకవర్గ ఇంచార్జ్ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో మొదటి విడతగా విడుదలైన వంద మంది దళిత బంధు పథకానికి అర్హులైన దళితులను ఎంపిక చేయవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై బాధ్యత ఉంచి గ్రామ సభలు నిర్వహించి అర్హులైన దళితులకు ఎంపిక చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అలా కాకుండా ప్రజాప్రతినిధులతో మధ్యవర్తులతో లబ్ధిదారుల ఎంపిక చేయడం వల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా వీరభద్ర, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బానోతు బాలాజీ, సిపిఎం మండల కార్యదర్శి నాగేశ్వరరావు, ఏర్పుల రాములు, ఎంపీటీసీ సభ్యులు భూక్య లచ్చు నాయక్, సొసైటీ వైస్ చైర్మన్ రేగళ్ళ తిరుమల రావు, ఇటిక్యాల లెనిన్, తేజావత్ కృష్ణకాంత్, సగుర్తి గురవయ్య తదితరులు పాల్గొన్నారు.