Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సార్వత్రిక సమ్మెలో తెరాస, టీజీబీకేఎస్ పాల్గొనాలి
- మందా నరసింహారావు
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28, 29న జరిగే సమ్మెలో తెరాస, బొగ్గు గని కార్మిక సంఘం టీజీబీకేఎస్ సమ్మేలో పాల్గొనాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు అన్నారు. స్థానిక జేకే 5ఓపెన్ కాస్ట్లో శనివారం బ్రాంచ్ కార్యదర్శి అబ్బాస్ అధ్యక్షతన జరిగిన సభలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కోల్ బ్లాకుల ప్రైవేటీకరణ నుతిప్పికొట్టాలన్నారు. జేబీసీసీఐ సమావేశంలో అన్ని జాతీయ కార్మిక సంఘాల డిమాండ్ మేరకు ఐదేండ్ల వెజ్ బోర్డు కాలపరిమితి నిర్ణయం అయ్యిందని అన్నారు. సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అని స్వయానా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. మాట నిలుపకోవాలని అన్నారు. సింగరేణి కార్మికులు నివసిస్తున్న క్వార్టర్ రిటైర్డ్ అయ్యాక వారికే ఆ ఇల్లు సొంతం చేయాలని డిమాండ్ చేసారు. ఇల్లందు జేకే కాలనీలో క్వార్టర్లు కూల్చి మున్సిపాలిటీకి ఆ స్థలం అప్పగించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, సదానందం, రాజేష్, రవి,మోహన్, కిరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.