Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
గత పది రోజుల నుండి గ్రామ రైతులకు సంబంధించిన వరిగడ్డి వాములకు రాత్రి సమయంలో నిప్పు పెట్టి కాలపెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో కలిసి రైతు నల్లమోతు హనుమంతరావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భీమవరం గ్రామంలో ఈ నెల 1వ తేదీ నుండి నేటి వరకు ఎనిమిది వరిగడ్డి వాములను గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారని అన్నారు. గత 30 సంవత్సరాల నుండి పంట గుళ్ళు, కంది పడగలు, వరిగడ్డి వాములకు నిప్పు పెడుతున్నారని, పత్తి, మిరప మొక్కలను పీకి వేస్తున్నారని తెలిపారు. సంఘటనలు రాత్రి సమయాల్లో జరుగు చున్నాయని వారు తెలిపారు. దుండగులను గ్రామస్తులు పట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకటం లేదని తెలిపారు. ఈ సంఘటనలతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారని తెలిపారు. ఇట్టి సంఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు స్పందించాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో రైతులు దివ్వెల వీరయ్య, గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు, కృష్ణారావు, హనుమంతరావు, శీలం శ్రీనివాస్‌రెడ్డి, జిపి కోటయ్య, వెంకయ్య, నారాయణ, సాంబశివరావు, వెంకటేశ్వర్లు, కుటుంబరావు తదితరులు ఉన్నారు.