Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణిలో ప్రైవేటీకరణ ఆపాలని, రామగుండం ఆర్జి 3లో మరణించిన కుటుంబాలకు ఉద్యోగం, రూ.కోటి ఇవ్వాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టియూసి) బ్రాంచ్ ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్ అన్నారు. శనివారం ఐఎన్టియూసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆర్జి3 డివిజన్లో ఏఎల్పి జరిగిన ప్రమాదంలో ఏరియా సేఫ్టి ఆఫిసర్ జయరాజ్, అసిస్టెంట్ మేనేజర్ చైతన్యతేజ్, కాంట్రాక్టర్ కార్మికుడు శ్రీకాంత్ చనిపోవడం చాలా విచారకరమన్నారు. వాళ్ల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ నెల 28, 29 తేదీలలో ఐఎన్టియూసి, ఇతర సంఘాల పిలుపు మేరకు సమ్మెను జయప్రదం చేయాలన్నారు. మార్చి 21 నుండి 31వ తేదీ వరకు గోలేటి నుండి సత్తుపల్లి వరకు జరుగు రణభేరి యాత్రను కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, పెదనాగయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.