Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
మండల ఆర్ఎంపీ సంఘం అధ్యక్షులుగా రవిశేఖర్ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 21వ జిల్లా మహాసభలో భాగంగా పినపాక మండల నూతన అధ్యక్షులు రవి శేఖర్ వర్మని మండల ఆర్ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు బి.వి.ఆర్ చేతుల మీదుగా మండల కమిటీ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు శ్రీరామ్, జమాల్ ఆధ్వర్యంలో మిగిలిన కమిటీని ప్రకటించారు. మండల ఉపాధ్యక్షులుగా శివ శంకర్, మండల ప్రధాన కార్యదర్శి కోడం నరసింహారావు, ప్రచార కార్యదర్శి వరికిల్ల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి శ్యామల సతీష్, మండల కమిటీ సభ్యులు బూర వెంకన్న, సిహెచ్ నరసింహారావు, రాజు, రాంబాబులను ఎన్నుకున్నారు.