Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14న పట్టణంలో జరిగే ర్యాలీని జయప్రదం చేయండి
- టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి సరియం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఆదివాసి యువతి ఇర్పా రాధ మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి సరిఎం కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గల రాధా కుటుంబాన్ని పరామర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తెలపడంతో పాటు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. పూర్తిస్థాయి విచారణ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 14 భద్రాచలం పట్టణంలో జరిగే ప్రదర్శనకు ఆదివాసి ఉద్యోగులు యువకులు విద్యార్థులు ఆదివాసీ సంఘాల నాయకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ఐద్వా జిల్లా అధ్యక్షులు రాజమ్మ, కొత్తపల్లి సర్పంచ్ వెంకటేశ్వర్లు, మారాయి గూడెం సర్పంచ్ తొడెం తిరుపతి రావు, కొత్తపెళ్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : రాధ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పట్టణ నాయకులు కుంజా శ్రీనివాస్, సోయం జోగారావు, సున్నం గంగలు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని పాల కేంద్రం వద్ద కుంజా విజయ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.