Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత
- ఎస్సై తేజావత్ కవిత
నవతెలంగాణ-బోనకల్
మాదక ద్రవ్యాలు, బాల్య వివాహాలు అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సై తేజావత్ కవిత అన్నారు. మండల పరిధిలోని రావినూతల గ్రామంలో పోలీస్ జనజాగృతి కళాబృందం సమాజ చైతన్యం కోసం సాంస్కృతిక కళా ప్రదర్శనలు శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ పోలీస్ కళాజాతను ఎస్సై తేజావత్ కవిత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల వలన స్త్రీలు ముందు ముందు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు. మాదక ద్రవ్యాల వల్ల యువత తమ భవిష్యత్తు ని నాశనం చేసుకుంటున్నారని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని కోరారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తేవడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, ఉప సర్పంచ్ బోయినపల్లి పెద్దకొండ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సోలాశంకర్ హెడ్ కానిస్టేబుళ్లు కొప్పుల లక్ష్మణ్ చౌదరి, అద్దంకి ఆనంద్ కుమార్, కానిస్టేబుళ్లు వెంకట్రావు, సత్యంబాబు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.