Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
టిప్పర్ను అతివేగంగా నడుపుతూ వచ్చి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి టిప్పర్ బోల్తా పడి డ్రైవర్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని న్యూలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రఘునాధపాలెం మండలానికి చెందిన బోడ కృష్ణ (42) అనే వ్యక్తి పిఎన్ఆర్ ట్రాన్స్పోర్ట్ లో టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ రఘునాధపాలెం నుండి పండురేగుపల్లి చెన్నయ్య కంకర క్వారీకి వెళ్తుండగా న్యూలక్ష్మీపురం వద్ద టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ కృష్ణ తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై తోట నాగరాజు తెలిపారు. మృతుడు కృష్ణ తమ్ముడు బోడ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్ఐ పేర్కొన్నారు.