Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లిలోని స్వయం సహాయ సంఘంలో సభ్యురాలైన జెక్కి మరియమ్మ కుటుంబానికి వెన్నెల గ్రామ సమాఖ్యం ఆధ్వర్యంలో శనివారం బియ్యం వితరణచేశారు. మరియమ్మకు ఇటివల భర్త మృతి చెంది ఆర్ధిక ఇబ్బందులు పడుతుంది. ఈక్రమంలో వీవో సభ్యులు ఆదుకోవటానికి ముందుకు వచ్చి బియ్యంతో పాటు ఆర్ధిక సాయాన్ని అందజేశారు. వెన్నెల గ్రామ సమాఖ్యలో 30 స్వయం సహాయక సంఘాలు ఉండగా వాటిలో 300మంది ఉండగా ప్రతి నెల సమావేశంలో సంఘాల నిర్వాహణతో సభ్యులు కుటుంబ యోగక్షేమాలు తెలుసుకుంటూ సహాయం కావల్సిన వారికి అందజేయటం చేస్తున్నట్లు వీవోఏ మమత తెలిపారు. ఈకార్యక్రమంలో సంఘాల లీడర్లు పెద్దమ్మ మహాలక్ష్మి, కేతిమళ్ల రాధ, గంగరబోయిన వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.